Actress Sonia Agarwal | సోనియా అగర్వాల్ పేరు చెప్పగానే బహుశా ఎవరికీ అంత తొందరగా స్ట్రయిక్ కాదేమో కానీ.. 7/G బృందావన కాలనీ హీరోయిన్ అంటే టక్కున గుర్తొస్తుంది. అనితగా తెలుగు ప్రేక్షకుల్లో సోనియా చూపిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. నిజానికి సోనియా అగర్వాల్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిందే తెలుగు సినిమాతోనే. వినీత్, అబ్బాస్ కలిని నటించిన నీ ప్రేమకై సినిమాలో కీలకపాత్రలో మెరిసింది. ఆ తర్వాత సెల్వరాఘవన్ కాదల్ కొండైన్ సినిమాతో సోనియాను తమిళ పరిశ్రమకు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ సినిమా బంపర్ హిట్టయింది. దాంతో తన నెక్ట్స్ సినిమా 7/G బృందావన కాలనీలోనూ ఆమెను హీరోయిన్గా పెట్టాడు. ఈ సినిమా కూడా సెన్సేషనల్ హిట్టయింది.
అదే టైమ్లో సెల్వరాఘవన్, సోనియాలు ప్రేమలో పడ్డారు. 2006లో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కాగా పెళ్లైన నాలుగేళ్లకే ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇక సెల్వా రాఘవన్ ఆ మరుసటి ఏడాదే నటి గీతాంజలిని పెళ్లి చేసుకున్నాడు. కానీ సోనియా మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంది. కాగా తాజాగా సోనియా ఓ ఇంటర్వూలో సెల్వరాఘవన్ గురించి తాము విడిపోవడం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
తమ వైవాహిక జీవితం గురించి ఇప్పుడు మాట్లాడటం ఇష్టంలేదని, తాము ఎందుకు విడిపోయామేమో అనేది సెల్వాకు, నాకు తెలుసు. ఇప్పుడు ఎవరి దారిలో వాళ్లము హ్యాపీగా ఉన్నామని చెప్పుకొచ్చింది. అయితే భార్యభర్తలుగా విడిపోయిన మేము స్నేహితులుగా మాత్రము అస్సలు కలిసుండలేమని చెప్పింది. సెల్వాను తను స్నేహితుడిగా యాక్సెప్ట్ చెయలేను. ప్రేమను కోల్పోయిన తర్వాత తన మొహం చూడడానికి కూడా నేను ఇష్టపడటం లేదు. భవిష్యత్తులో కూడా సెల్వా రాఘవన్ను కలిసే అవకాశం రాకూడదనే కోరుకుంటున్నానంటూ సోనియా సంచలన వ్యాఖ్యలు చేసింది.