NTR Neel | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #NTRNeel అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది (2026) సమ్మర్ కానుకగా.. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదిలావుంటే ఈ సినిమాలో కథానాయికకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెకండ్ ఆఫ్‌లో ఇంపార్టెంట్ రోల్లో శ్రద్ధా కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచేలా రూపొందించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే, స్క్రిప్ట్ విషయంలో ఆయన చాలా సమయం తీసుకున్నారని సమాచారం. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రాలన్నింటిలోకి ‘డ్రాగన్’ అత్యుత్తమంగా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.