Shalini Pandey | ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. ఆ లిస్టులో అందరికంటే ముందొచ్చే ముద్దుగుమ్మ షాలిని పాండే. మొదటి సినిమాతోనే పాత్ బ్రేకింగ్ హిట్ ఇచ్చినా.. ఆ తర్వాత మాత్రం అమ్మడును అస్సలు ఎవరూ పట్టించుకోలేదు. అక్కడే వచ్చింది అసలు సమస్య. ఎంతగా అందాలు ఆరబోసినా.. లిప్ లాక్ సీన్స్ చేసినా కూడా షాలినికి మాత్రం ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు. అయినా ఇండస్ట్రీలో హిట్ పడగానే మేడమ్ అంటూ వెంట పడతారు అనుకోవడం అంతా సుద్ద దండగే. ఎందుకంటే అది అందరికీ వర్కవుట్ అవ్వదు.
కొందరు హీరోయిన్లు ఫ్లాప్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి మరీ.. ఆ తర్వాత స్టార్స్ అవుతుంటారు. అప్పుడు శ్రీయ అయినా.. ఇప్పుడు పూజా హెగ్డే అయినా ఇలా వచ్చిన వాళ్లే. కానీ రికార్డ్ బ్రేకింగ్ హిట్స్ ఇచ్చి కూడా చాలా మంది హీరోయిన్లు అవకాశాల వేటలో వెనకబడి పోతుంటారు. అందులో షాలిని పాండే వస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చూస్తూనే ఉంది కానీ రాలేదు.. వచ్చేలా లేదు కూడా. అర్జున్ రెడ్డి చిత్రంలో లిప్ లాక్స్.. హాట్ సీన్స్ తో రెచ్చిపోయింది ఈ థియేటర్ ఆర్టిస్ట్. ఈ సినిమా విడుదలవ్వగానే విజయ్ దేవరకొండ రేంజ్లో తాను కూడా స్టార్ అయిపోతానని కలలు కనేసింది ఈ బ్యూటీ. కానీ అలాంటిదేం జరగలేదు.
కేవలం విజయ్ మాత్రమే స్టార్ అయ్యాడు కానీ షాలిని మాత్రం చిన్నా చితకా సినిమాలు మాత్రమే చేసుకుంటుంది. ఈ మధ్య అవి కూడా రావట్లేదు. అందుకే గ్లామర్ షో తప్ప మరో దారి లేకుండా పోయింది ఈ భామకు. అర్జున్ రెడ్డి తర్వాత మహానటి లాంటి సినిమాలు చేసినా కూడా స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమాలో కీలక పాత్ర చేసింది కానీ ఆ సినిమా వచ్చినట్లే ఆడియన్స్కు గుర్తు లేదు. ఇదిలా ఉంటే తాజాగా హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది. తాజాగా విడుదలైన ఈ ఫోటోలు చూస్తుంటే మతులు పోతున్నాయి. కసి చూపులతో కళ్లతోనే ప్రాణాలు తీస్తుంది ఈ ముద్దుగుమ్మ.