మలయాళ భామ సంయుక్తమీనన్ను టాలీవుడ్లో అదృష్ట నాయికగా అభివర్ణిస్తారు. ‘భీమ్లానాయక్’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి..అనంతరం బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకుంది. ఇటీవలే ‘డెవిల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ అమ్మడి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఏడాదిలో పెళ్లిపీటలెక్కే ఆలోచనలో ఈ అమ్మడు ఉందని..అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదని వార్తలొస్తున్నాయి. అయితే సంయుక్తమీనన్ సన్నిహితులు మాత్రం అవన్నీ సోషల్‌మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమేనని, బిజీ షెడ్యూల్‌కు కాస్త విరామం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కొత్త ప్రాజెక్ట్‌లను అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఈ పెళ్లి వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఈ భామ స్పందించాల్సిందేనని అభిమానులు కోరుకుంటున్నారు.