Samantha Ruthu Prabhu | ఈ మధ్య సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం ఎమోషనల్ నోట్లు, కోట్స్ పెడతూ హాట్‌టాపిక్‌గా మారుతుంది. ఇక గతేడాది సామ్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిని షాక్‌కు గురిచేసింది. ఆ మధ్య ‘యశోద’ ప్రమోషన్లో కంటతడి పెట్టుకోవడంతో ఆ విషయం ఒక్క సారిగా వైరల్ అయింది. ఇక ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటుంది. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తను సక్సెస్ అని నిరూపించుకుంటుంది. ఈ వ్యాధి కారణంగా గతకొన్ని నెలలుగా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సమంత ఇటీవలే కెమెరా ముందుకు వచ్చింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా సామ్ మరోసారి వార్తల్లో నిలిచింది. తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ కింది నుంచి పై వరకు మెట్టు మెట్టుకు హారతి వెలిగించుకుంటూ వెళ్లింది. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోవాలని పూజలు జరిపించినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సామ్ ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ రూపకర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో జాయిన్ అయింది. ఇక త్వరలోనే విజయ్ దేవరకొండ ఖుషీ షూటింగ్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది.
ఇక సమంత నటించిన శాకుంతలం ఇటీవలే రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేసుకుంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రావాల్సిన శాకుంతలం ఏప్రిల్ 14కు వాయిదా పడింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఇటీవలే రిలీజైన ట్రైలర్ విపరీతమైన ఆసక్తి నెలకొల్పింది.
பழனி முருகன் கோயிலில் 600 படிகளிலும் சூடம் ஏற்றி நடிகை சமந்தா வழிபாடு#SamanthaRuthPrabhu𓃵 | #Samantha | #palanimurugantemple | #palani pic.twitter.com/hzaJTIaD8P
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) February 13, 2023