ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్ (Kolors)’ తన 53వ బ్రాంచ్ ‘కలర్స్ 2.0’ను శ్రీకాకుళంలో అత్యంత వైభవంగా ప్రారంభించింది. నగరంలోని పాలకొండ రోడ్డు, పాండురంగ వీధిలో ఏర్పాటు చేసిన ఈ నూతన బ్రాంచీని ప్రముఖ సినీ నటి రెజీనా కాసాండ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ, నేటి ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని అధిగమించడం మరియు అధిక ఆలోచనలను దూరం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని, అందాన్ని సొంతం చేసుకోవచ్చని సూచించారు. తనకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా కూరగాయలకు (వెజిటేబుల్స్) తన ఆహారంలో అధిక ప్రాధాన్యత ఇస్తానని ఆమె పేర్కొన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన బరువు తగ్గడం, జుట్టు మరియు చర్మ సమస్యలకు అత్యాధునిక చికిత్సలను శ్రీకాకుళం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రెజీనా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, 22 ఏళ్ల అనుభవంతో యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన అత్యాధునిక టెక్నాలజీని ఇక్కడ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన తన సొంత ఊరైన శ్రీకాకుళంలో ఈ సెంటర్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, చెన్నై వంటి నగరాల్లో లభించే అత్యుత్తమ సేవలను ఇక్కడి వాసులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆపరేషన్ విభాగ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, 51 మంది డెర్మటాలజిస్టుల పర్యవేక్షణలో నడిచే ఏకైక వెల్నెస్ సెంటర్ తమదని, సురక్షితమైన పద్ధతుల్లో బరువు తగ్గించడం తమ ప్రత్యేకత అని వివరించారు. 5ఎం మీడియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రముఖులు పాల్గొని నూతన బ్రాంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.