నటి పూర్ణ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ అలీతో ఆమె పెండ్లి ఘనంగా జరిగింది. దుబాయ్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. షనీద్ అసిఫ్, పూర్ణ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వారి నిశ్చితార్థం కేరళలో జరిగింది. తెలుగులో ‘సీమ టపాకాయ్’, ‘అవును’, ‘అఖండ’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ. ప్రస్తుతం బుల్లితెరపైన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది. తన వివాహ వేడుక సందర్భంగా పూర్ణ స్పందిస్తూ…‘నువ్వు నన్ను బాగా ప్రేమించావు. నన్ను మార్చాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. అందువల్ల నాకు ఇష్టమైన కెరీర్‌ను కొనసాగిస్తున్నాను. ఎల్లప్పుడూ నీ తోడుగా ఉంటాను’ అని పేర్కొంది.