ఇంద్రారామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘చౌర్య పాఠం’. నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో నక్కిన త్రినాథ రావు నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. క్రైమ్ ఎలిమెంట్స్, డార్క్ హ్యూమర్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత త్రినాథ రావు నక్కిన చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. చౌర్య పాఠం అంటే దొంగతనం చేయడానికి నేర్చుకునే ట్రిక్కులు కాదని, ఒక అవసరం కోసం దొంగతనం చేయాల్సి వచ్చినప్పుడు, ఈ క్రమంలో నేర్చుకునే విషయాలని తెలిపారు. ఈ డార్క్హ్యూమర్ క్రైమ్ కామెడీ కథలో చక్కటి లవ్‌స్టోరీ ఉంటుందని, సాంకేతికంగా అన్ని అంశాల్లో ఉన్నతంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు. ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌కు గురిచేసే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశామని దర్శకుడు నిఖిల్ తెలిపారు. ఈ చిత్రానికి కథ, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: దావ్జాంద్, నిర్మాత: నక్కిన త్రినాథ రావు, రచన-దర్శకత్వం: నిఖిల్ గొల్లమారి.