Parineeti Chopra-Raghav Chadha Engagement | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా ఎంగేజ్మెంట్ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఉన్న కపుర్తాలా హౌస్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నాయకులు సహా సుమారు 150 మంది అతిథులు హాజరయ్యారు. వారి సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టడానికి సిద్ధమైయ్యారు. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, ప్రియాంక చోప్రాతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు వచ్చారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా కలిసి చదువుకున్నారు. కామన్ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగిందని, అది కాస్త ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పటి మార్చిలో వీళ్ల విషయం బయటకు వచ్చింది. వీరిద్దరూ కలిసి ఓ హోటల్‌కు డిన్నర్ డేట్‌కు వచ్చారు. అప్పుడు వీళ్లకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దాంతో త్వరలోనే వీళ్లు వివాహబంధంలోకి అడుగు పెట్టడానికి ముస్తాబవుతున్నారంటూ వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి.