Nidhhi Agerwal | ప్రముఖ నటి నిధి అగర్వాల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాన్ని వినియోగించడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. ఒక పనిమీద విజయవాడకి వెళ్లిన నిధి ఏపీ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించినట్లుగా పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ విషయంపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించే వాహనాలను వ్యక్తిగత, వాణిజ్య కార్యక్రమాలకు ఎలా ఉపయోగిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే కేటాయించిన ఈ వాహనాలను ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన నటికి కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుండి లేదా నిధి అగర్వాల్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కాగా ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుంది అనేది చూడాలి.
ఎవడబ్బ సొమ్ము అని ప్రభుత్వ వాహనం లో తిప్పుతున్నారు తనని
ఆవిడ కేవలం డబ్బు తీసుకుని నటించే మాములు మనిషి అంతే
తనకోసం AP ప్రజల సొమ్ము వాడుతున్నారా 💦@JanaSenaParty pic.twitter.com/vlXQ5Xg0Uv— AVM (@AvmNews7) August 11, 2025