Rx100 Movie | ఆర్ఎక్స్100 సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Payal rajput | గత పదేళ్లలో పెను సంచలనం సృష్టించిన సినిమాల్లో ఆర్ఎక్స్ 100 ఒకటి. కల్ట్ బొమ్మగా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కుమ్మరించింది. డెబ్యూ సినిమాతోనే అజయ్ భూపతి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర మాములు షాక్ కాదు.
Payal rajput | గత పదేళ్లలో పెను సంచలనం సృష్టించిన సినిమాల్లో ఆర్ఎక్స్100 ఒకటి. కల్ట్ బొమ్మగా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కుమ్మరించింది. డెబ్యూ సినిమాతోనే అజయ్ భూపతి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర మాములు షాక్ కాదు. అప్పటికే ఓ అబ్బాయిని ప్రేమించి, పెళ్లికి కూడా సిద్ధమైన అమ్మాయి.. మధ్యలో శారీరక సుఖం కోసం ఇంకొక అబ్బాయిని లైన్లో పెట్టి, అతణ్ని వాడుకుని వదిలేయడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు మాములు షాక్ ఇవ్వలేదు. ఈ ట్విస్టే నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. ఇక దాదాపు యూత్ అంతా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయి బ్లాక్ బస్టర్ చేసి పెట్టారు.
ఈ సినిమాతో పాయల్ పేరు ఒక్క సారిగా టాలీవుడ్లో మార్మోగిపోయింది. కామంతో, విరహవేదనతో రగిలిపోయే అమ్మాయి పాత్రలో జీవించేసింది. ఈ సినిమా సక్సెస్‌లో పాయల్ మేజర్ రోల్ పోషించింది అనడంలో అతిశయోక్తి లేదు. ఓ వైపు గ్లామర్‌తో కట్టిపడేస్తూనే.. మరో వైపు సినిమా చివర్లో నెగెటీవ్ షెడ్స్‌ను బయటకు తీసి ప్రేక్షకులను వెర్రెత్తిపోయేలా చేసింది. అయితే ముందుగా ఈ రోల్ కోసం అజయ్ భూపతి ముందుగా మరో హీరోయిన్ను అనుకున్నాడట. ఆమె మరోవరో కాదు ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన నందిత శ్వేత. అజయ్ ముందుగా ఈ క్యారెక్టర్ కోసం నందిత శ్వేతను అప్రోచ్ అయ్యాడట. కానీ క్యారెక్టర్ మరీ బోల్డ్‌గా ఉండటంతో నందిత రిజెక్ట్ చేసిందట.
ఈ విషయాన్ని స్వయంగా నందిత శ్వేత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నందిత శ్వేత నటించిన హిడింబ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో తెగ బిజీగా గడుపుతుంది. ప్రమోషన్లో భాగంగా ఈ అమ్మడు ఆర్ఎక్స్ 100 సినిమా గురించి చెప్పుకొచ్చింది. ఆర్ఎక్స్100 సినిమాలో హీరోయిన్ చాన్స్ మిస్ చేసుకున్నానని, పాయల్ ఆ సినిమాకు వంద శాతం న్యాయం చేసిందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

