Nandini Rai | బిగ్‌బాస్ ఫేం నందినిరాయ్ (Nandini Rai) మోకాళ్ళ మీద తిరుమల మెట్లు ఎక్కి దైవ దర్శనం చేసుకుంది. నందిని రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో కొత్తకొత్త లుక్స్‌లో కనిపిస్తూ అందరి మతులు పోగొడుతుంది. అయితే ఈ భామకి దైవ చింతన ఎక్కువేనని ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు సమయం దొరికినప్పుడల్లా తిరుమలకి వెళుతుంది ఈ భామ.
అయితే తాజాగా నందిని రాయ్ తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. తొలి ఎకాదశి సందర్భంగా.. మెట్ల మార్గంలో మోకాళ్లపై ఏడుకొండలపైకి చేరుకొని.. తిరుమలేశుడిని దర్శించుకుంది. అద్బుతమైన అనుభవం.. దేవుడికి కృతజ్ఞతలు చెప్పలేకుండా ఉండలేకపోతున్నా.. మోకాళ్లపై కొండపైకి వెళ్లి గోవిందుడి ఆశీస్సులు పొందానంటూ వీడియోను షేర్ చేసింది. కాగా ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ భామ తెలుగులో మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజనీ చిత్రాల్లో నటించింది. వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో గాలివాన వెబ్ సిరీస్ కూడా చేసింది. స్పెషల్ సాంగ్‌లో కూడా మెరిసింది నందినీ రాయ్. ఈ హైదరాబాదీ భామ తెలుగుతోపాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా నటించింది.