Meenakshi Chaudhary | అభిమానులతోపాటు నేను కూడా ‘గుంటూరు కారం’ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందరి ఎదురుచూపులకూ సరైన సమాధానం ఇచ్చే సినిమా ‘గుంటూరుకారం’ అని అందాలభామ మీనాక్షిచౌదరి అంటున్నది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘గుంటూరుకారం’ సినిమా గురించి ఆసక్తికరంగా మాట్లాడింది.
‘సూపర్‌స్టార్‌తో సినిమా ఛాన్స్ రాగానే నా ఆనందానికి అవధులు లేవు. తొలిరోజు చాలా టెన్షన్ పడ్డాను. పైగా ఫస్ట్‌డే ఫస్ట్ షాట్ ఆయనతోనే చేశాను. నా భయాన్ని గమనించి, ‘ఎందుకు టెన్షన్ పడుతున్నావు. కూల్‌గా ఉండు.. కావాలంటే కాసేపు టైమ్ తీస్కో.. ఏం కాదు..’ అంటూ ధైర్యం చెప్పారు. స్నేహపూర్వకమైన ఆయన ప్రవర్తన నాలో భయాన్ని పోగొట్టేసింది. నిజంగా మహేశ్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన ఫ్యామిలీపర్సన్. మంచి వ్యక్తి.. ప్రత్యేకమైన వ్యక్తి. ప్రతిఒక్కరినీ గౌరవిస్తారు. అందుకే ఆ స్థాయిలో ఉన్నారు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది మీనాక్షి చౌదరి. ‘గుంటూరుకారం’ సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే.