Madhuri Dixit Mother Passes away | బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మాధురీ తల్లి స్నేహలత దీక్షిత్(91) ఆదివారం ఉదయం మరణించింది. వయోభారం కారణంగా ఆమె మృతి చెందినట్లు తెలుస్తుంది. కాగా ఆదివారం సాయంత్రం ముంబైలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. స్నేహలత మరణం పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
తల్లి మరణంపై మాధురీ దీక్షిత్ ఎమోషనల్ అయింది. ఆమె ప్రశాంతంగా తనకు ఇష్టమైన వారి మధ్య, వారిని చూస్తూ స్వర్గానికి పయనమైంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వేసింది. కాగా గత ఏడాది మాధురీ తన తల్లి స్నేహలత బర్త్‌డేకు కూడా ఎమోషనల్ ట్వీట్ చేసింది. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా.. కూతురికి అమ్మే మంచి ఫ్రెండ్ అని అంటుంటారు.. అది నిజమే కదా?. నువ్ నాకోసం చేసినవన్నీ, నాకు నేర్పిన బుద్దులన్నీ కూడా నాకు బహుమతులే. నువ్ ఎప్పుడూ ఆరోరాగ్యాలతో ఉండాలి అంటూ పోస్ట్ చేసింది.