Ileana D’Cruz | బేబి బంప్‌తో ఇలియానా.. ఫోటోలు వైరల్
Ileana D’Cruz baby Bump Photos | మూడు వారాల క్రితం ఇలియానా ప్రెగ్నెంట్ అయినట్లు చెప్పడంతో ఒక్క సారిగా సోషల్ మీడియా హీటెక్కింది. ‘త్వరలో నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నాను.. నా చిట్టి డార్లింగ్’ అంటూ రెండు ఫోటోలను షేర్ చేస్తూ ప్రెగ్నెంట్ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది.
Ileana D’Cruz baby Bump Photos | పదిహేడేళ్ల క్రితం వచ్చిన ‘దేవదాసు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమానే తెలుగులో తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పోకిరితో ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అయితే ఇలియానా దూకుడు ఎక్కువ రోజులు ఇక్కడ సాగలేకపోయింది. ఒకానొక దశలో వరుస పరాజయాలు పలకరించాయి. గోల్డెన్ లెగ్ అన్నవాళ్లే.. ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేశారు. దాంతో మకాం ముంబైకి షిఫ్ట్ చేసింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఒకటి, రెండు సినిమాలు తప్పితే చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయలేదు. దాంతో గత కొంత కాలంగా ఇలియానా కెరీర్ అడపా దడపాగా సాగుతుంది.
ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే మూడు వారాల క్రితం ఇలియానా ప్రెగ్నెంట్ అయినట్లు చెప్పడంతో ఒక్క సారిగా సోషల్ మీడియా హీటెక్కింది. ‘త్వరలో నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నాను.. నా చిట్టి డార్లింగ్’ అంటూ రెండు ఫోటోలను షేర్ చేస్తూ ప్రెగ్నెంట్ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది. ఇక పెళ్లి కాకుండానే తల్లి అయినట్లు తెలపడంతో నెటిజన్లు తండ్రి ఎవరో చెప్పమంటూ తెగ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ గోవా బ్యూటీ బేబి బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దానికి క్రికెటర్ కే.ఎల్ రాహుల్ భార్య, నటి అతియాశెట్టి లవ్ సింబల్‌ను జత చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఇక ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్ కొనసాగింది. కాగా కొన్నాళ్ల డేటింగ్ తర్వాత అతడితో బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత కత్రినాకైఫ్ సోదరుడు స్టెబాస్టిన్తో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ ఎన్నో సార్లు ఈ జంట మీడియా కంట పడింది. మరీ ఆ బిడ్డ వీళ్లద్దరికి పుట్టబోయే బిడ్డేనా? లేదా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ గోవా సోగసరి ‘అన్ఫేర్ అండ్ లవ్లీ’ అనే హిందీ సినిమాలో నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

