Actress Eesha Rebba | గాజువాకలో సందడి చేసిన ఈషా రెబ్బ.. అట్టహాసంగా ‘కలర్స్’ 54వ బ్రాంచ్ ప్రారంభం
Kolors Health care | నటి ఈషా రెబ్బ చేతుల మీదుగా గాజువాకలో ‘కలర్స్ 2.0’ వెల్నెస్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ వెల్నెస్ మరియు హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్’ తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తూ, విశాఖపట్నంలోని గాజువాకలో తన 54వ బ్రాంచీని అత్యంత అట్టహాసంగా ప్రారంభించింది.
Actress Eesha Rebba | నటి ఈషా రెబ్బ చేతుల మీదుగా గాజువాకలో ‘కలర్స్ 2.0’ వెల్నెస్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ వెల్నెస్ మరియు హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్’ తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తూ, విశాఖపట్నంలోని గాజువాకలో తన 54వ బ్రాంచీని అత్యంత అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈషా రెబ్బ జ్యోతి ప్రజ్వలన చేసి నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యం మరియు అందం అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో యువత ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారానే మెరుగైన ఆరోగ్యం, సహజమైన అందం సిద్ధిస్తాయని ఆమె పేర్కొన్నారు. విశాఖ నగరం అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని చెబుతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక చికిత్సలను గాజువాక వాసులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. బరువు తగ్గడం, చర్మం మరియు జుట్టు సమస్యలతో బాధపడే వారికి కలర్స్ సంస్థ అందించే సేవలు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, తాను చదువుకున్న గాజువాక ప్రాంతంలోనే ఈ సరికొత్త బ్రాంచీని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత 22 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో తమ సంస్థ పనిచేస్తోందని, ముఖ్యంగా బరువు తగ్గడం వల్ల సుమారు 90 రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని ఆయన వివరించారు. తమ సంస్థలో 250 మందికి పైగా న్యూట్రిషనిస్టులు, 100 మంది నిపుణులైన వైద్యులు, మరియు 2000 మందికి పైగా శిక్షణ పొందిన టెక్నీషియన్లు సేవలందిస్తున్నారని వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అప్డేట్ చేస్తూ, యూఎస్-ఎఫ్‌డీఏ (US-FDA) ఆమోదం పొందిన అత్యాధునిక పరికరాలతో ‘కలర్స్ 2.0’ ద్వారా అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ, రెండు దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్న కలర్స్ సంస్థ, గాజువాక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దిందని తెలిపారు. ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 51 మంది డెర్మటాలజిస్టులతో సేవలు అందిస్తున్న ఏకైక వెల్నెస్ సంస్థ తమదేనని గర్వంగా చెప్పారు. 5ఎం మీడియా ఆధ్వర్యంలో జైదీప్ పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో స్థానిక యువత, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అత్యాధునిక వెల్నెస్ సేవలు ఇకపై గాజువాక వాసులకు చేరువలో ఉండటం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

