Actress chitra died | కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్ ప్రముఖ నటి చిత్ర(56) గుండెపోటుతో మరణించారు. శనివారం తెల్లవారుజామున చెన్నైలోని తన నివాసంలో చిత్ర గుండెపోటుతో మరణించారు. ఈమె తెలుగు, తమిళం, మళయాలం,కన్నడతో పాటు హందీ సినిమాలలో కూడా నటించింది. 100పైగా చిత్రాల్లో, పలు టీవీ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది. దర్శక దిగ్గజం కే.బాలచందర్ తెరకెక్కించిన అపూర్వ రాగంగళ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగంలోకి పరిచయమైంది. ఇందులో కమల్‌హాసన్, శ్రీదేవీలతో కలిసి ఈమె నటించింది. ఇక తెలుగులో అమావాస్య చంద్రుడు, పదహారేళ్ల అమ్మాయి, ప్రేమించాక, ఇంద్రధనస్సు, ఆంటీ సినిమాలో నటించింది.చిత్ర మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు
చిత్ర మలయాళంలో అట్టకలశం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ప్రేమ్ నజీర్, మోహన్‌లాల్, లక్ష్మీలు ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మేరీకుట్టి పాత్రను చిత్ర పోషించింది. ఈమె నటించిన అవల్ అప్పాడితాన్, ఆటో రాజా, క్రోధం, చిన్న పూవే మెల్ల పెసు, ఎన్ తంగచ్చి పడిచావా, ఎదురు కాట్రు, ఎంగల్ స్వామి అయ్యప్పన్, చిన్నవర్ , పారంభరియమ్ మరియు కబడ్డీ కబడ్డీ వంటి సినిమాలు మంచి పేరును తీసుకువచ్చాయి. వివాహం తర్వాత ఈమె సినిమాలకు దూరమైంది.