Ala Bolelo | ‘జైలర్ 2’ నుంచి హుషారెత్తించే ఫస్ట్ సింగిల్.. ‘అలా బోలేలో’ సాంగ్ వచ్చేసింది!
Jailer 2 | సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’ (Jailer 2). సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’ (Jailer 2). సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ తొలి పాటను విడుదల చేశారు. ‘జైలర్’ మొదటి భాగంలో తమన్నాపై వచ్చిన ‘కావాలావయ్యా’ సాంగ్ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ‘జైలర్ 2’ నుంచి ‘అలా బోలేలో’ (Ala Bolelo) అంటూ సాగే హుషారైన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో నటి పూర్ణ (Shamna Kasim) అదిరిపోయే స్టెప్పులతో ఈ స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. ట్రెండీ బీట్స్‌తో కూడిన ఈ పాటకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) తనూ స్వయంగా ఆలపించి, అదిరిపోయే సంగీతం అందించారు. తెలుగు వెర్షన్‌కు శ్రీనివాస మౌళి చక్కని సాహిత్యం అందించగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటను మరింత కలర్ఫుల్గా మార్చింది. సాంగ్ మధ్యలో రజనీకాంత్ స్టైలిష్ ఎంట్రీ, ఆయన గ్రేస్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదిలాఉంటే, ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

