రాంచి: చెక్ బౌన్స్ కేసులో ‘గదర్ 2’ సినిమా కథానాయిక అమీషా పటేల్ కోర్టులో సరెండర్ అయ్యింది. ఇవాళ ఉదయం రాంచి సివిల్ కోర్టులో ఆమె లొంగిపోయింది. సినిమా నిర్మాత, వ్యాపారవేత్త అజయ్ కుమార్.. అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్ కేసు వేశాడు. సినిమా నిర్మిస్తానంటూ అమీషా తన దగ్గర రూ.2.5 కోట్లు అప్పుగా తీసుకున్నదని, ఆ తర్వాత ఆమె సినిమా పూర్తిచేయలేదని, తన డబ్బు తనకు తిరిగి ఇవ్వలేదని అజయ్‌కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. అసలు రూ.2.5 కోట్లకు వడ్డీ రూ.50 లక్షలు కలిపి మొత్తం రూ.3 కోట్లు ఇప్పించాలని ఆయన కోర్టును కోరాడు.
ఈ కేసు విచారణ చేసిన కోర్టు ఏప్రిల్ నెల 6న అమీషాకు వారెంట్ ఇష్యూ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ కోర్టులో లొంగిపోయింది. అనంతరం కోర్టు ఆమె షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో కోర్టు బయటికి వచ్చిన మీడియాను చూసి తలకు ముసుగు కప్పుకుంది. కోర్టులో ఏం జరిగిందో చెప్పమని మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించినా ఆమె పట్టించుకోకుండా కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
बिहार अभिनेत्री अमीषा पटेल ने रांची की सिविल कोर्ट में किया सरेंडर, मामला चेक बाउंस से जुड़ा है ,कोर्ट ने उन्हें 21 जून को दोबारा पेश होने का निर्देश दिया है ,,,,
Amisha Patel | #AmishaPatel@KaushikiDubey8 pic.twitter.com/j6wPnxv1q0
— manishkharya (@manishkharya1) June 17, 2023