Actress Abhinaya | టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ చెల్లెలుగా నటించిన అభినయ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఈ అమ్మడు దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు అక్కగా నటించి మెప్పించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అభినయ మెరిసింది. పుట్టుకతోనే మూగ, చెవుడు వంటి అంగ వైకల్యం ఉన్నప్పటికీ పట్టుదలతో నటిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయ. గత కొద్ది రోజులుగా ఈ అమ్మడి ప్రేమ, పెళ్లి వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క ఫోటోతో అన్ని పుకార్లకు తెరదించారు అభినయ.
కొద్ది రోజుల క్రితం ఎంగేజ్మెంట్ రింగ్స్ తొడిగి ఉన్న చేతులతో ఉన్న ఫోటోలను షేర్ చేసి తాను త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా అందరికి క్లారిటీ ఇచ్చింది. ఇక హైదరాబాద్‌కు చెందిన వీ. కార్తీక్ (సన్నీ వర్మ)తో బుధవారం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అభినయ, కార్తీక్, అభినయ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కాగా ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దల అంగీకారంతో ఎట్టకేలకి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.
తాజాగా అభినయ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.దీంతో మహేశ్,ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పలువురు హీరోల ఫ్యాన్స్ కూడా ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, మార్క్ ఆంటోనీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారని.. అది పెళ్లిదాకా వచ్చినట్టు టాక్ నడుస్తుంది. అయితే గతంలో విశాల్, అభినయ ప్రేమలో ఉన్నారని వారిద్దరు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు కూడా ప్రచారం నడిచింది. కాని ఆ వార్తలన్నీ పుకార్లుగా మిగిలిపోయాయి. అభినయ, కార్తీక్ జంట చూడముచ్చటగా ఉందని, ఆ జంట నిండునూరేళ్లు సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని కోరుతున్నారు.