కన్నడ యువ హీరో పృథ్వీ అంబర్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్తలవాడి’. సిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర హీరో యష్ తల్లి పుష్ప అరుణ్‌కుమార్ నిర్మాణరంగంలోకి అడుగుపెడుతూ తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
బుధవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. కొత్తలవాడి కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని ఓ గ్రామం. ఆ ప్రాంతం తాలూకు మూలాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ ..అక్కడే అధిక భాగం చిత్రీకరణ జరిపామని, హృద్యమైన గ్రామీణ ప్రేమకథగా మెప్పిస్తుందని చిత్రబృందం తెలిపింది.