Gaami | టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గామి’ (Gaami). చాందిని చౌదరి కథానాయిక నటిస్తున్న ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్నాడు. క్రౌడ్ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ సినిమాకు కార్తీక్ శబరీష్ నిర్మాత. మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే గామి నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్ విడుదల చేయగా.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో ఆకట్టుకుంటుంది.
ఇదిలావుంటే ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విశ్వక్ సేన్ శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారులను నేడు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న విశ్వక్ సేన్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు విశ్వక్. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక ‘గామి’ సినిమా నుంచి ‘శివమ్’ అనే పాటను ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.
Team #Gaami in the divine temple town of Srisailam to launch the #Shivam song 🔱
The spirit of #Gaami Full song out today at 4.05 PM
— Suresh PRO (@SureshPRO_) March 4, 2024