Leo Movie | తమిళ హీరో దళపతి విజయ్‌పై పోలిసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే విజయ్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న లియో సినిమాలోని నా రెడీ పాట విడుదలైంది. రిలీజైన గంటల్లోనే మిలియన్లలో వ్యూస్ రాబట్టి చార్ట్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ లిరికల్ సాంగ్‌లో విజయ్ చాలా చోట్ల సిగరెట్‌తో కనిపించాడు. దాంతో ఓ వ్యక్తి ఈ పాటలో విజయ్ పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించేలా ఉన్నారంటూ, నార్కోటిక్స్ నియంత్రణ చట్టం సెక్షన్ కింద పోలీసు కేసు పెట్టాడు. ఈ సాంగ్‌లో మద్యం, పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవలే విజయ్ తమిళనాడులోని 10,12 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలిశారు. దాదాపు 12 గంటలు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటించడమే కాకుండా.. వారికి ప్రోత్సాహకాలు అందించారు. మంచిగా ఉండడమే కాకుండా..డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేలా తల్లిదండ్రులు పోత్సాహించాలని చెప్పాడు. అలాంటి విజయ్ ఇప్పుడు సినిమాల్లో సిగరెట్ తాగుతూ నటించడం ఏం బాగోలేదని ఆ సదరు వ్యక్తి తెలిపాడు.
లియో సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ల కాంబోలో సినిమా తెరకెక్కడం, పైగా ‘LCU’లో భాగంగా సినిమా తెరకెక్కున్నట్లు వార్తలు రావడంతో లియోపై ఎక్కడలేని హైప్ పెరిగింది. దానికి తోడు విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్ సైతం మిలియన్లలో వ్యూస్‌ను సాధించి.. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం ఏకంగా ఇరవై కోట్లకు పైగా పలుకుతున్నాయని సమాచారం.