నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. నిన్నటికంటే పరిస్థితి కాస్త మెరుగైందని వారు వెల్లడించారు. గత శుక్రవారం తీవ్రమైన గుండెపోటుతో అనారోగ్యానికి గురయ్యారు తారకరత్న. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆస్పత్రికి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ…‘ క్రిటికల్‌గానే ఉన్నా వైద్యానికి స్పందిస్తున్నారు. నేను ఐసీయూలోకి వెళ్లి పలకరించే ప్రయత్నం చేశాను. కొంత స్పందన కనిపించింది. తారకరత్న ఈ విపత్కర పరిస్థితితో పోరాడుతున్నారు. ఆయనలో ఆత్మబలం ఉంది. అభిమానుల ఆశీర్వాదంతో తప్పకుండా కోలుకుంటారు. కర్నాటక వైద్యారోగ్య శాఖ మంత్రి సుధాకర్ ఎంతో సహకరిస్తున్నారు’ అని చెప్పారు.