Hero Suman – Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి వలనే హీరో సుమన్ కెరీర్ నాశనం అయ్యిందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం పెద్దగా మారి అప్పట్లో సుమన్ ఫ్యాన్స్కి, చిరు ఫ్యాన్స్కి మధ్య వార్ కూడా నడిచింది.
ఇదిలావుంటే తాజాగా ఈ వివాదంపై హీరో సుమన్ క్లారిటీ ఇచ్చాడు. ఫ్యాన్స్ అనవసరంగా మా కోసం కొట్టుకుంటున్నారు. చిరంజీవి వలన నా కెరీర్ నాశనం కాలేదు. మేమందరం చాలా క్లోజ్.. మేం బాగానే ఉంటాం. అప్పుడప్పుడు పార్టీలలో కూడా కలుస్తుంటాం. చిరంజీవి నన్ను ఎదగకుండా తొక్కేశాడు అని వచ్చిన వార్తల్లో అసలు అర్థం లేదని సుమన్ అన్నాడు. యూట్యూబ్లో చూసిందే నిజమని నమ్మి ఏదేదో చేయొద్దని అభిమానులను కోరుతున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు.