Anudeep-sivakarthikeyan Next Movie post poned | తమిళ హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రెమో’ సినిమాతో తెలుగులో కూడా మంచి క్రేజ్‌ను ఏర్పరచుకున్నాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈయన సినిమాలు ఏకకాలంలో విడుదలవుతుంటాయి. గతేడాది ‘డాక్టర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న శివ కార్తికేయన్ ఈ సారి ‘డాన్’ సినిమాతో మరో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ సినిమా చేస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనుదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్లు ఓ ఫన్నీ వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో అనుదీప్, శివకార్తికేయన్ మట్లాడుతూ సందడి చేశారు. సినిమా విడుదలకు కారణం సత్యరాజ్ అంటూ కార్తికేయన్ చెప్పుకొచ్చాడు. ఇంతలో సత్యరాజ్, హీరోయిన్ మరియా ఎంట్రీ ఇవ్వడంతో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న తెలుగు, తమిళంలో విడుదల కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో అనుదీప్ తన స్టైల్ కామెడీ పంచులతో నవ్వించాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
#PrinceForDiwali 💥 here’s the official announcement video!🇮🇳🕊🇬🇧https://t.co/Bc849MvWP1#Sathyaraj sir @anudeepfilm #MariaRyaboshapka @MusicThaman @manojdft @Premgiamaren @Cinemainmygenes @SVCLLP @SureshProdns @ShanthiTalkies @Gopuram_Cinemas
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 21, 2022