Shreyas Talpade | గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు
Shreyas Talpade | ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే (Shreyas Talpade) గుండెపోటుకు గురయ్యాడు (heart attack).
Shreyas Talpade | ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే (Shreyas Talpade) గుండెపోటుకు గురయ్యాడు (heart attack). ముంబైలో జరుగుతున్న షూటింగ్లో పాల్గొన్న శ్రేయాస్.. షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్లిన తర్వాత గురువారం సాయంత్రం ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన అంధేరీలోని బెల్లెవో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల పరిశీలనలో ఉన్నాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం శ్రేయాస్ వయస్సు 47 ఏళ్లు.
హిందీ, మరాఠీ సినిమాల్లో నటించిన తల్పాడే మంచి గుర్తింపు పొందాడు. ‘ఇక్బాల్’, గోల్మాల్ రిటర్న్, ఓం శాంతి ఓం, హౌస్‌ఫుల్ – 2 వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రశంసలు పొందాడు. ప్రస్తుతం ‘వెల్ కమ్ 3’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, దిశా పటానీ, సునీల్ శెట్టి, పరేష్ రావల్, రవీనా టాండన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, రాజ్‌పాల్ యాదవ్, కికు శారదా, దలేర్ మెహందీ, మికా సింగ్, రాహుల్ దేవ్, ముఖేష్ తివారీ, షరీబ్ హష్మీ తదితరులు నటిస్తున్నారు.
Also Read..
AK 63 | ఇంటివాడైన మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్.. విశాల్ విషెస్
Pooja Hegde | పూజాహెగ్డేకు చంపుతామంటూ బెదిరింపు.. ఆ వార్తలు నమ్మొద్దంటున్న అందాలభామ
నాగ్ ‘లవ్ యాక్షన్ రొమాన్స్’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

