Pooja Hegde | అందాలభామ పూజాహెగ్డే దుబాయ్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైంది. అక్కడ అనుకోకుండా పెద్ద గొడవ జరిగింది. ఏమైందో ఏమోగానీ కొందరు వ్యక్తులు చెలరేగిపోయి పూజా హెగ్డే మీదకు దూసుకొచ్చారు. ‘చంపేస్తాం’ అంటూ పూజాను బెదిరించారు. దీంతో పూజా హెగ్డే హడలిపోయి పరుగు లంకించుకున్నది.
ఏంటీ.. ఇదంతా నిజమే అనుకుంటున్నారా?.. ముంబయికి చెందిన ఓ ప్రైవేటు ఛానల్ వండివార్చిన తప్పుడు న్యూస్ ఇది. ఈ వార్త వల్ల కంగారుపడ్డ పూజా అభిమానులు.. ‘ఏం జరిగింది?’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై పూజ హెగ్డే మాట్లాడుతూ ‘అసలు ఇలాంటి తప్పుడు రాతలు ఎందుకు రాస్తారో అర్థం కావట్లేదు. ఎవరూ ఈ వార్తను నమ్మొద్దు. ఇందులో ఎలాంటి నిజం లేదు. నాపై ఇలాంటి రూమర్లు సృష్టించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా’ అని చెప్పింది పూజాహెగ్డే.