సినిమాల విషయంలో కాస్త నిదానించిన అగ్ర హీరో నాగార్జున ఉన్నట్టుండి వేగం పెంచేశారు. ప్రస్తుతం నాగ్ ‘నా సామిరంగ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఆ వెంటనే మరో సినిమాను కూడా లైన్లో పెట్టేశారు నాగ్.
తమిళ దర్శకుడు అనిల్ చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాకు ‘లవ్ యాక్షన్ రొమాన్స్’ అనే పేరు పరిశీలనలో ఉంది. త్రిష ఇందులో కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. గతంలో ‘కింగ్’ సినిమాలో నాగార్జునతో జతకట్టింది త్రిష. ఆ సినిమా మంచి హిట్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ సెట్టయ్యిందన్న మాట. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.