Shivaji Raja Speech | చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమా సక్సెస్‌మీట్ మంగళవారం జరుగగా.. ఈ వేడుకలో శివాజీ రాజా తన మాటలతో నవ్వులు పూయించాడు. ఈ సినిమాలో శివాజీరాజా కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. శివాజీరాజాకి జోడిగా సీనియర్ నటి అనితా చౌదరి నటించింది. అయితే ఈ వేడుకలో శివాజీ మాట్లాడుతూ.. అనితతో కలిసి నేను చాలా సినిమాల్లో నటించాను. మురారి సమయంలో అయితే కృష్ణవంశీ అనితకి లవ్ లెటర్ రాయమన్నాడు. అతడు చెప్పాడు కదా అని నేను కూడా గోదవారి యాసలో అనితకి ఒక ప్రేమలేఖని రాశాను. అయితే దానిని మురారి సినిమా సెట్లో ఉన్న అందరికి చూపించడమే కాకుండా ఒకసారి నాకు యాక్సిడెంట్ అయితే ఆసుపత్రికి వచ్చి నా భార్యకి కూడా చూపించిందంటూ ఆరోజు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు శివాజీ రాజా. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.