Actor Shivaji | దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన భావోద్వేగంతో క్షమాపణ చెప్పారు. వేదికపై తాను రెండు అనుచితమైన పదాలు ఉపయోగించినందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని శివాజీ తెలిపారు. స్టేజ్‌పై నుంచి దిగిన వెంటనే తన తప్పు ఎంత పెద్దదో తనకు అర్థమైందని, ఆ మాటలు చెప్పడం పూర్తిగా తప్పేనని ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో
నటుడు శివాజీ మాట్లాడుతూ ‘‘నేను ఆరోజు స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు క్షమాపణలు చెబుతున్నాను. ఆ రెండు పదాలను మాట్లాడకుండా ఉండాల్సింది. జీవితంలో అలా పదాలను ఎప్పుడూ దొర్లలేదు. నేను ఇక్కడకు వచ్చి 30 సంత్సరాలవుతుంది. అన్నేళ్లు పాలిటిక్స్‌లో ఉన్నప్పటికీ ఏరోజు కూడా ఏ మహిళనైనా, పార్టీనైనా హద్దు దాటి మాట్లాడలేదు. అలాంటి భగవంతుడు ఎందుకో అలా చేశాడు. పదాలు అలా దొర్లిపోయాయి. ఆ విషయంలో చాలా బాధపడ్డాను. కార్యక్రమం నుంచి బయటకు రాగానే గెస్ట్‌తో అన్నాను. అబ్బాయ్.. దొర్లేశానని అన్నాను. ఆ రెండు పదాలకు మీ అందరికీ సిన్సియర్‌గా క్షమాపణలు చెబుతున్నాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికీ భయపడేది లేదు. ఆ రెండు పదాలు మాత్రం అన్‌పార్లమెంటరీ వర్డ్స్. కాబట్టి నా గుండె సాక్షిగా చెబుతున్నాను. చాలా బాధపడుతున్నాను. అలా మాట్లాడటం తప్పు.
నేను 36 గంటలైంది. సరిగ్గా నిద్రపోయి.. నాపై నమ్మకంతో నిర్మాత నాకు అవకాశం ఇస్తే.. ఇలా ఎందుకు జరిగిందని నాలోనే అంతర్మథనానికి లోనయ్యాను. అందుకనే రాలేకపోయాను. దండోరా సినిమా రేపు (డిసెంబర్ 25) రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా ప్రమోషన్‌కు వస్తానని ప్రొడ్యూసర్‌గారికి చెప్పాను. రేపు విడుదలవుతున్న దండోరా సినిమాను మీకు దగ్గరగా ఉన్న థియేటర్స్‌లో చూడండి. సమాజాన్ని పట్టి పీడిస్తోన్న కుల వ్యవస్థ మీద.. ప్రేమ పట్ల వ్యతిరేకత తరతరాలుగా నడుస్తోంది.. భవిష్యత్తులోనూ నడుస్తుంది. వాటిని గట్టిగా స్పృశిస్తూ.. అలాగే అసమానతలపై తీసిన సినిమా. అయినా మనుషులు మారరు. ఎన్నోసార్లు చెప్పే ఉంటారు. అయినా మనుషులు మారరు. మారతారనే ఆశతో పని చేసుకుంటూ వచ్చే తరాలకు మంచిని అందించాలనే ఉద్దేశంతో, మంచి కథతో చేసిన సినిమా.
కథ, నిజమైన కొన్ని ఘటనలతో సినిమా చేశాను. ఈ సినిమాకు పని చేసిన ఆర్ట్ డైరెక్టర్స్ అయితే ఆ నెటివిటీని, 1998-2000 కాలాన్ని కొన్ని ఘటలను బేస్ చేసుకుని మంచి ప్రేమ కథను, కుల వ్యవస్థను స్పృశిస్తూ చేసిన సినిమా దండోరా. మంచి సినిమాను అందించిన దర్శకుడు, నిర్మాతకు పేరు పేరునా ధన్యవాదాలు.
ఇక నేను వ్యక్తిగతంగా కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. నా కన్నా ముందు చాలా మంది గొప్ప జర్నలిస్టులు తెలుగు జాతి మొత్తం వాళ్ల మాటల్ని వింటూ.. సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఆరాటంతో పని చేస్తోన్న చాగంటి కోటేశ్వరరావు, అలాగే గరికపాటిగారి ప్రవచనాల్లో స్త్రి పట్ల, స్త్రీకున్న ప్రాముఖ్యత పట్ల వాళ్లు మాట్లాడిన సందర్భాలున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో అలాంటివి చేయొద్దు మీరు. సినిమాల్లో ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ బయట అలాంటివి చేయటం వల్ల, ఉండటం వల్ల, కట్టు బొట్టు వల్ల బయటకు వచ్చినప్పుడు మీరు ఇబ్బందులకు గురవుతారని ఎంతో మంది పదే పదే పెద్దవాళ్లు, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్లు జనరేషన్స్‌కు చెబుతూ వచ్చారు.
నేను అలా మాట్లాడటానికి కారణం. ఇటీవల లులూ మాల్లో నిధి అగర్వాల్ పడ్డ వేదన.. తను కారులోకి వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందికరంగా ఫీల్ అయ్యిందో నా మైండ్‌లో నుంచి పోలేదు. ఆ తర్వాత సమంతగారు కూడా అలాంటి ఇబ్బందే పడ్డారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 90 శాతం మంది ఫిమేల్ ఆర్టిస్టులు జయసుధగారు, విజయశాంతిగారు, రమ్యకృష్ణగారు..కట్టుకున్న మోడల్ చీరలని చెప్పి షాప్స్‌లో అమ్మేవారు.
నేను ఈ డ్రెస్సులు వేసుకోండి.. ఆ డ్రెస్సులు వేసుకోండి.. మీరు కప్పేసుకోండని ఎవరికీ చెప్పలేదు. నేను ఎవర్నీ చెప్పటానికి. సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ.. సమాజం సినిమా వల్ల చెడిపోతుందని, మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుందని అంటున్నారు. సినిమా వల్లనే ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటున్నాం. ఇక్కడే బ్రతికి, ఇక్కడ వచ్చిన డబ్బులతోనే నా పిల్లలను చదివించుకుంటున్నా. సినిమాను ఎవరూ ఏమీ అనకూడదనే ఆలోచనతో మాట్లాడానంతే. అసలు ఆ రెండు పదాలను నా నోటి నుంచి ఎందుకొచ్చాయనేది ఇప్పటకీ నమ్మబుద్ధి కావటం లేదు.
ఈ విషయంలో నా భార్యకు నేను ముందు క్షమాపణలు చెప్పాను. అసలు ఏ స్టేటస్‌లో ఈ మాటలు మాట్లాడావని అంది. రేపు నా పిల్లలు వాళ్ల ఫ్రెండ్స్ దగ్గర ఇబ్బంది పడకూడదు. రాత్రి పన్నెండు తర్వాత ట్వీట్స్ చిన్మయిగారికి, అనసూయగారికి ట్యాగ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు, ఏపీ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, మహిళా కమీషన్‌కు లేఖలు పంపేశారు. నన్ను ఒక్క మాట కూడ అడగలేదు. సుప్రియగారు మాత్రమే మాట్లాడారు. నేను ఆమెకు సారీ చెప్పాను. తప్పుగా మాట దొర్లిందని చెప్పాను. ఆమె అర్థం చేసుకున్నారు.
మనం అందరం బూతులు మాట్లాడుకుంటాం. కానీ స్టేజ్‌పై ఉన్నప్పుడు, మాట్లాడేటప్పుడు ఓ పద్ధతి ఉంటుంది. నేను ఎవరితోనూ మిస్ బిహేవ్ చేయలేదు. ఇప్పటికీ భూమికగారితో మాట్లాడుతాను. ఆమెను మేడమ్ అనే పిలుస్తాను. లయను లయమ్మ అంటాను. రంభగారు, సంఘవిగారితో చేశాను. ఏరోజు ఎవరితోనూ మిస్ బిహేవ్ చేయలేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు ఇదే మనకు గుదిబండై కూర్చుంటుంది.
జరిగిన తప్పుకి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను మాట్లాడిన ఇంటెన్షన్ వేరు. జడ్జ్ అయినా ఎవరైనా ఇంటెన్ష్ చూస్తారు. నాకంటే పెద్ద పదాలను ఎవరూ వాడలేదు. నన్నే ఎందుకు మీరు!. అమరావతి రైతులపై బూటు కాలు వేసి తొక్కినప్పుడు నేను మాట్లాడాను. నేను నిలబడ్డాను. ఎన్నో సందర్భాలో నిలబడ్డాను. జెన్ జీ కోసం నాయకులతో ఫైట్ చేశాను.
నేను క్షమాపణ చెప్పానని అన్నప్పటికీ ఉమెన్ కమీషన్ వాళ్లు డిసెంబర్ 27న రమ్మని చెప్పారు. పర్లేదు.. నేను వెళ్లి క్షమాపణ లేఖ ఇస్తాను. నేనేం సిగ్గు పడను.
డండోరా సినిమా డిఫరెంట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో మంచి అంచనాలతో విడుదలవుతోంది.. మొదటి పాట ‘పిల్లా’.. భావోద్వేగంతో, హృదయాన్ని హత్తుకునే పాటగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటకు 3.2 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి, ఇందులోని హుక్ స్టెప్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. దీని తరువాత మార్క్ కె. రాబిన్ సంగీతం అందించిన టైటిల్ సాంగ్ విడుదలై సినిమాపై అంచనాలను మరింత పెంచింది. గ్రామీణ నేపథ్యంతో వచ్చిన టీజర్ 1.7 మిలియన్ వ్యూస్ సాధించగా.. ట్రైలర్ విడుదలైన నాలుగు రోజుల్లోనే 2.1 మిలియన్ వ్యూస్ దాటింది.
పూర్తి కమర్షియల్ తెలుగు సినిమాగా తెరకెక్కిన డండోరా.. గ్రామీణ కథతో పాటు కుల వ్యవస్థ, సామాజిక అసమానతలపై స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ చిత్రాన్ని మురళీకాంత్ దర్శకత్వం వహించగా లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు.
ఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మాణికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు నటించారు.
డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తుంటే.. ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక ఏరియాల్లో ప్రైమ్ షో రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్లో 200కు పైగా థియేటర్స్‌లో సినిమాను అథర్వణ భద్రకాళి పిక్చర్స్ గ్రాండ్ రిలీజ్ చేస్తోంది. పాటలు టి సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. సెన్సార్ ప్రక్రియ పూర్తయ్యి 16 కట్స్‌తో సినిమాకు అనుమతి లభించింది. సమాజంలోని నిజాలను ప్రశ్నించే కథతో డండోరా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, ఏడాది చివర్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించి వైవిధ్యమైన సినిమాగా ప్రేక్షకులను పలకరించనుంది.