Tollywood Drugs Case | 7 గంటలపాటు రానా విచారణ
టాలీవుడ్ (Tollywood) డ్రగ్స్ (Tollywood Drugs Case) కేసు విచారణలో భాగంగా ఇవాళ నటుడు రానా (Rana) ఈడీ (Enforcement Directorate) ఎదుట హాజరయ్యాడు. రానా విచారణ ముగిసింది. సుమారు 7 గంటలపాటు రానా విచారణ కొనసాగింది.

టాలీవుడ్ (Tollywood) డ్రగ్స్ (Tollywood Drugs Case) కేసులో 12 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపిన ఈడీ ఒక్కొక్కరిగా విచారిస్తున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఇవాళ టాలీవుడ్ యాక్టర్ రానా (Rana) ఈడీ (Enforcement Directorate) ఎదుట హాజరయ్యాడు. రానా విచారణ ముగిసింది. సుమారు 7 గంటలపాటు రానా విచారణ కొనసాగింది. రానాతోపాటు అతని ఆడిటర్ సతీశ్ ను కూడా ప్రశ్నించారు అధికారులు. ఈ కేసులో కీలక నిందితుడు కెల్విన్ (Kelvin)ను, రానాను కలిపి ఈడీ విచారించింది.
2016 నవంబర్ లో జరిగిన ఎఫ్ క్లబ్ పార్టీపై విచారించింది ఈడీ. ఎఫ్ లాంజ్ పబ్ లో జరిగిన పార్టీ గురించి ఆరా తీశారు. పార్టీ తర్వాత రానా ఖాతాల నుంచి నగదు బదిలీలు జరిగినట్టుగా ఈడీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు రానాకు సుమారు 100 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టినట్టు తెలుస్తోంది. రానా 2015-18 బ్యాంక్ స్టేట్ మెంట్లను ఈడీకి సమర్పించాడు. రెండు బ్యాంకు ఖాతాల వివరాలిచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు హై సెక్యూరిటీతో ఉన్న కెల్విన్ ల్యాప్ టాప్ ను తెరిపించారు అధికారులు.
ఇక రేపు ఈడీ విచారణకు రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, నవదీప్ హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందులని ఈడీ అధికారులు విచారించారు. నవదీప్‌కు చెందిన ఎఫ్ క్లబ్‌కు రానా తరచూ వెళ్లినట్టు, ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్టు ఆధారాలు లభించడంతో రానాకు ఈడీ నోటీసులు పంపింది.
ఇవి కూడా చదవండి..
Nivetha: ఆవు పాలు పితికి, కాఫీ చేసుకున్న వకీల్ సాబ్ భామ
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని
Sanjay Dutt: సౌత్‌లోను బిజీ అవుతున్న సంజయ్ దత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Drugs Case
- Kelvin
- Rana
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

