Prabhas Hosted Party | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్ ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈయన ఓ భారీ హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. బాహుబలి తర్వాత విడుదలైన రెండు సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్ బీ అమితాబ్ కీలకపాత్రలో నటించాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాజాగా హైదరాబాద్ షెడ్యుల్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చిత్రబృందానికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.
ప్రాజెక్ట్ కే మూవీ టీంకు హైదరాబాద్‌లోని హోటల్ సితారలో ప్రభాస్ పార్టీని ఇచ్చాడు. ఈ పార్టీకి బిగ్‌బి అమితాబ్, దీపికా పదుకొణెలతో పాటు దుల్కర్ కూడా హాజరయ్యాడు. ఈ పార్టీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ షూటింగ్ చివరి దశలో ఉంది. వీటీతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కనుంది.
#Prabhas with the #ProjectK Team 😍💥 pic.twitter.com/OtyR32mMqu
— Prabhas Fanism ™ (@PrabhasFanism) June 25, 2022