బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కన్నడ నటుడు నితిన్ గోపి గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. ఛాతిలో నొప్పిగా ఉందన్న ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్సకు స్పందించలేదు. దాంతో ఆయన అప్పటికే మృతిచెందారని వైద్యులు తెలిపారు. దాంతో బెంగళూరులోని ఇట్టెమడులోగల ఆయన స్వగృహానికి నితిన్ గోపి మృతదేహాన్ని తరలించారు.
ప్రస్తుతం నితిన్ గోపీ వయసు 39 ఏళ్లు. ఆయనకు ఇంకా వివాహం కాలేదు. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు లెజెండరీ హీరో డాక్టర్ విష్ణువర్ధన్తో కలిసి ‘హలో డాడీ’ సినిమాలో ఆయన కొడుకుగా నటించాడు. ఆ సినిమా నితిన్ గోపికి జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఇచ్చిన ఫేమ్‌తో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. పలు సీరియల్స్‌లో కూడా ఆయన నటిస్తున్నారు.