అమ్మ సలహాను పాటిస్తున్నా

‘నటుడిగా యాభై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకోవడం ఆనందంగా ఉంది. సెట్స్‌లో దర్శకుడి నుంచి లైట్‌బాయ్ వరకు ప్రతి ఒక్కరిని గౌరవించాలని మా అమ్మ విజయనిర్మల చెప్పింది. ఆ సలహాను నేటికి పాటిస్తున్నా. ఆ క్రమశిక్షణే నన్ను ముందుకు నడిపిస్తున్నది’ అని అన్నారు సీనియర్ నటుడు నరేష్ విజయ్ కృష్ణ. నేడు ఆయన జన్మదినం.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘నటుడిగా యాభై ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా కొత్త పాత్రలు వేసే అవకాశం లభిస్తుండటం ఆనందంగా ఉంది. యువ దర్శకులు, రచయితలు నన్ను దృష్టిలో పెట్టుకొని విభిన్నమైన క్యారెక్టర్స్ సృష్టిస్తుండటం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నా. సుదీర్ఘ ప్రయాణంలో ఏ రోజూ నేను నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదు. వివాదాల జోలికి వెళ్లలేదు. పారితోషికం గురించి ఆలోచించకుండా మంచి సినిమాలకు అండగా నిలుస్తున్నా. స్వీయనిర్మాణ సంస్థ విజయకృష్ణ బ్యానర్లో గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలొచ్చాయి. ఆ బ్యానర్‌ను తిరిగి ప్రారంభించే ఆలోచన ఉంది. ఈ సంస్థ ద్వారా న్యూజనరేషన్తో కూడిన వినోదప్రధాన సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. అమ్మ విజయనిర్మల పేరుతో ఓ స్టూడియోను నిర్మిస్తున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నటీనటుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసింది. ‘మా’ను రాజకీయవేదికగా మార్చవద్దు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటున్నా. సినీపెద్దలు, ఏపీ ప్రభుత్వం కలిసి త్వరలో చక్కటి నిర్ణయానికి వస్తారనే నమ్మకముంది. ప్రస్తుతం అంటే సుందరానికి, అన్నీ మంచి శకునములే, గని,తో పాటు పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్నా’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Actor Naresh
- Birthday
- MAA
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

