Kota Srinivasa Rao | నేను బతికే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: కోట శ్రీనివాసరావు
Kota Srinivasa Rao | తెలుగు సినీ చిత్రపరిశ్రమలో దిగ్గజ నటుల్లో ఒకరు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao). ఆయన గురించి ఓ విషాదబరితమైన వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కోట శ్రీనివాసరావు చనిపోయారన్నది ఆ వార్త సారాంశం. అయితే, ఈ విషయంపై కోట స్పందించారు.
Kota Srinivasa Rao | తెలుగు సినీ చిత్రపరిశ్రమలో దిగ్గజ నటుల్లో ఒకరు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao). విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ కోట ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. వృద్ధాప్య కారణాల రీత్యా ఇటీవల సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఓ విషాదబరితమైన వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కోట శ్రీనివాసరావు చనిపోయారన్నది ఆ వార్త సారాంశం. అయితే, ఈ విషయంపై కోట స్పందించారు. తాను ఆర్యోగంగానే ఉన్నానని, వదంతులు నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
‘నేను మృతి చెందినట్లు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. నా ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని వస్తున్న వార్తలన్నీ అసత్యాలే. నేను ఆరోగ్యంగానే ఉన్నా. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా ప్రచరాం చేయడం భావ్యం కాదు. ఈ వార్తలు చూసి నా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కలత చెందారు. అంతా ఫోన్లు చేసి పరామర్శించడం చాలా ఇబ్బంది కలిగించింది. వదంతులు నమ్మొద్దు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. సోషల్ మీడియాలో అసత్యప్రచారాలు చేయడం ఓ వ్యాపారంలా భావిస్తున్నారేమో. ఇటీవల గాయని సుశీలపై కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఆమె కూడా చివరికి నేను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చింది. నన్ను 40 సంవత్సరాల నుంచి ఓ కళాకారుడిగా ప్రేక్షకులు పోషిస్తున్నారు. 70 ఏండ్లు వచ్చాయి. అయినా, నా అదృష్టం కొద్దీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలేం లేవు. బతికున్న నన్ను చంపెయ్యకండి’ అంటూ కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని.. తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోట శ్రీనివాసరావు కోరారు.
Also Read..
Rupert Murdoch | 92 ఏండ్ల వయసులో.. ఐదో పెండ్లికి సిద్ధమైన బిలియనీర్
Amazon Layoffs | ఉద్యోగులకు మరోసారి షాకిచ్చిన అమెజాన్
Paul Grant | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
MLC Kavitha | ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత.. వెళ్లేముందు ఫోన్లను మీడియాకు చూపించిన ఎమ్మెల్సీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

