Actor Kirstie Alley | హాలీవుడ్ ప్రముఖ నటి కిర్స్టీ అల్లీ కన్నుమూత.. ఏమైందంటే..!
Actor Kirstie Alley | హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి కిర్స్టీ అల్లీ (71) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె సోమవారం రాత్రి
Actor Kirstie Alley: హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి కిర్స్టీ అల్లీ (71) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కిర్స్టీ కుమారుడు విలియం ట్రూ స్టీవెన్సన్, కుమార్తె లిల్లీ ప్రైస్ స్టీవెన్సన్ వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. తమ తల్లిగారికి క్యాన్సర్ ఉందని ఇటీవల గుర్తించామని, దానితో పోరాడుతూనే ఇవాళ ఆమె మరణించారని వారు పేర్కొన్నారు.
‘‘ఆమె ఇన్నాళ్లూ గొప్పగా పోరాడిందని, ఆమె జీవితంలోని అంతులేని ఆనందాలను తమకు వదిలేసి వెళ్లిపోయిందని, మోఫిట్ క్యాన్సర్ సెంటర్లోని వైద్యులు, నర్సుల బృందం ఆమెకు అద్భుతమైన చికిత్స అందించారని, వారికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు సోషల్ మీడియాలో రాసుకున్నారు. నటి కిర్స్టీ అల్లీ 1970లో బాబ్ అల్లీని వివాహం చేసుకున్నారు.
1977లో వారిద్దరూ విడిపోయారు. తర్వాత పార్కర్ స్టీవెన్సన్ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అల్లీ 1987 నుంచి 1993 వరకు ఎన్బీసీ సిట్కామ్ ‘‘చీర్స్’’లో రెబెక్కా హోవే పాత్రను పోషించి మంచి గుర్తింపు పొందారు. ఈ పాత్ర కోసం ఆమె 1991లో ఎమ్మీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్‌ను అందుకున్నారు. ఆమె ‘‘డ్రాప్ డెడ్ గార్జియస్’’, ‘‘వెరోనికాస్ క్లోసెట్’’, ‘‘ఇట్ టేక్స్ టూ’’, ‘‘సిబ్లింగ్ రివాల్రీ’’, ‘‘షూట్ టు కిల్’’, ‘‘లవర్ బాయ్’’, ‘‘రన్ అవే’’ వంటి డజన్ల సినిమాలు చేశారు. టీవీ కార్యక్రమాల్లో హోస్ట్ గా కూడా వ్యవహరించారు.
అల్లే మరణంపట్ల ఆమె సహనటుడు జాన్ ట్రావోల్టా విచారం వ్యక్తంచేశారు. ‘‘కిర్స్టీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది’’ అని పేర్కొన్నారు. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను కిర్స్టీ. మనం మళ్ళీ ఒకరినొకరు చూస్తామని నాకు తెలుసు’’ అని ఇన్‌స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

