Junior Movie | పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం జూనియర్. వైరల్ వయ్యారి పాటతో ఫుల్ వైరల్‌గా మారిన ఈ కుర్రాడు జూనియర్‌తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలీల, జెనిలియా డిసౌజా, రవిచంద్రన్, రావురమేష్, ఆచ్యుత్ రావు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా.. సాయి శివానీ సమర్పణలో వరాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్లపై రజనీ కొర్రపాటి నిర్మించారు. తెలుగుతో పాటు కన్నడ భాషలో ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు తెలుగులో మంచి ఆదరణ లభించడంతో తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు నటుడు కిరీటి. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. ‘జూనియర్’కు వస్తున్న ప్రేమ, ఆదరణను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఎంతో నిజాయితీగా, హృదయపూర్వకంగా ఈ సినిమాను తీశాం. మీకు మంచి సినిమాలు అందించడానికి మేము ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటాం. మీ ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇట్లు మీ కిరీటి అంటూ పోస్ట్ చేశాడు.
తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు.
‘జూనియర్’కు వస్తున్న ప్రేమ, ఆదరణను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది.
మేము ఎంతో నిజాయితీగా, హృదయపూర్వకంగా ఈ సినిమాను తీశాం.మీకు మంచి సినిమాలు అందించడానికి మేము ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటాం.
మీ ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని… pic.twitter.com/TFEqkUHd4M
— Kireeti (@KireetiOfficial) July 19, 2025