Karthi | తమిళ నటుడు కార్తీ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నాడు. కార్తీ నటించిన తాజా చిత్రం ‘సత్యం సుందరం'(Sathyam Sundaram). ఈ సినిమాకు 96 దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది.
సినిమా చూసిన ప్రేక్షకులందరూ చాలా రోజులకు ఒక మంచి సినిమా చూశామంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ మూవీ సాధించిన విజయం పట్ల హీరో కార్తీ, దర్శకుడు ప్రేమ్ కుమార్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సోమవారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆశీర్వాదం అందించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం హీరో కార్తీకి దర్శకుడు ప్రేమ్‌కి స్వాగతం పలికారు.
Hero @Karthi_Offl, along with the Sathyam Sundaram movie team, visited the Bezawada Durga temple. Karthi shared, “Our family holds a deep reverence for Vijayawada Kanakadurga. I prayed for the success of Sathyam Sundaram to become a super hit!” #Karthi #SathyamSundaram pic.twitter.com/3d3vG6qxNn
— Telugu Chitraalu (@TeluguChitraalu) September 30, 2024