Actor Dasaradha | కష్టకాలంలో ఉన్న కమెడియన్ రామచంద్రకు ఆర్థిక సహాయం అందించిన నటుడు అయినబత్తిన దశరధ
Comedian Ramachandra | తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న అయినబత్తిన దశరధ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
Comedian Ramachandra | తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న అయినబత్తిన దశరధ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ‘వెంకీ’ సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ రామచంద్ర బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న దశరధ, నేరుగా ఆయనను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. తోటి కళాకారుడి కష్టాన్ని అర్థం చేసుకుని ధైర్యం చెప్పడం ద్వారా ఆయన గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా దశరధ మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఒక కుటుంబంలా ముందుకు వచ్చి రామచంద్రకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రామచంద్ర చికిత్సకు మరింత సహాయం అందేలా ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. దశరధ చూపిన మానవత్వానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ నెల 30న విడుదల కానున్న ఆయన ‘కిల్లర్’ సినిమా ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రస్తుతం ‘కిల్లర్’ చిత్రంలో నటిస్తూనే, లైన్ ప్రొడ్యూసర్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తున్న దశరధ.. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

