ఆస్కార్ అవార్డుల వేడుకల్లో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్‌పై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. చెంపదెబ్బ కొట్టినందుకు విల్ స్మిత్‌పై ఆస్కార్ వేడుకలు, ఈవెంట్లలో పాల్గొనకుండా పది సంవత్సరాల పాటు పదేళ్ల పాటు బ్యాన్ విధిస్తూ మోషన్ పిక్చర్ అకాడమీ ఇటీవల నిర్ణయించింది. అయితే, దీనిపై మరో హాలీవుడ్ నటుడు హ్యారీ లెనిక్స్ స్పందించారు. స్మిత్ చేసిన పనికి ఈ శిక్ష ఒక్కటే సరిపోదన్నారు. విల్ స్మిత్ నుంచి ఉత్తమ నటుడి కేటగిరిలో ఇచ్చిన ఆస్కార్ అవార్డును తిరిగి తీసుకోవాలన్నాడు.
అయితే, నా దృష్టిలో ఇది తగిన శిక్ష కాదని, విల్ స్మిత్ తన వార్డు ఎక్స్‌ప్రెస్ మెయిల్ ద్వారా అకాడమీకి అవార్డును తిరిగి ఇవ్వాలన్నాడు. అకాడమీ నిర్ణయం దిగ్భ్రాంతి కలిగించిందని హ్యారీ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన 94వ ఆస్కార్ వేడుకల సందర్భంగా తన భార్యపై కామెంట్ చేయడంతో కమెడియన్ క్రిస్రాక్ను చెంపదెబ్బ కొట్టాడు. ఆ తర్వాత బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ.. బోర్డు అకాడమీ గవర్నర్లు పది సంవత్సరాలు బ్యాన్ విధించగా.. అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు విల్ స్మిత్ పేర్కొన్నాడు.