Dharma Mahesh | హైదరాబాద్ చైతన్యపురిలో భోజన ప్రియుల కోసం నాణ్యమైన వంటకాలతో ‘జిస్మత్ మండీ’ రెండవ శాఖను సినీ నటుడు, ఈ రెస్టారెంట్ అధినేత ధర్మ మహేష్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ రెస్టారెంట్ ద్వారా అతిథులకు నోరూరించే వంటకాలను అత్యుత్తమ నాణ్యతతో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. తన కుమారుడు జగద్వాజపై ఉన్న అపారమైన ప్రేమతోనే, ఇంతకుముందు ఉన్న ‘గిస్మత్ మండీ’ పేరును ‘జిస్మత్ మండీ’గా రీబ్రాండింగ్ చేసినట్లు ధర్మ మహేష్ వెల్లడించారు. అతిథి సేవల రంగంలో ఈ కొత్త గుర్తింపుతో మరింత బలమైన అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ రీబ్రాండింగ్ కేవలం పేరు మార్పు కాదు. ‘Gismat’ నుంచి ‘Jismat’కు మారడం నాణ్యత, భావోద్వేగం, మరియు వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుంది. ఈ పరివర్తన భావోద్వేగపరంగా మరింత లోతుగా సాగుతుంది. కంపెనీ మొత్తం యాజమాన్యాన్ని నా కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నాను. ఈ పరివర్తన పూర్తయ్యే వరకు, నేను కార్యకలాపాలు, విస్తరణను పర్యవేక్షిస్తాను. అంటూ ధర్మ మహేష్ తెలిపాడు.
‘జిస్మత్ మండీ’లో వడ్డించే ప్రతి బిర్యానీ ప్లేట్, తమ అతిథుల ప్రతి చిరునవ్వు తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని ధర్మ మహేష్ అన్నారు. “మేము అందించే రుచి, నాణ్యత మరియు ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి. ఈ పరిణామం రాబోయే దశాబ్దాల పాటు మా బ్రాండ్‌ను బలోపేతం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము,” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
‘జిస్మత్ మండీ’ తన ప్రత్యేకమైన ‘జైలు’ థీమ్‌తో ఇప్పటికే ఫుడ్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. ఇటీవల అమీర్‌పేట్‌లో తొలి శాఖను ప్రారంభించిన ధర్మ మహేష్, అతి తక్కువ సమయంలోనే చైతన్యపురిలో రెండవ శాఖను ప్రారంభించడం విశేషం.