చేతన్ చీను, బన్నీ వోక్స్ జంటగా నటించిన చిత్రం ‘విద్యార్థి’. మధు మాదాసు దర్శకుడు. మహాస్ క్రియేషన్స్ పతాకంపై ఆళ్ల వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘ ఓ విద్యార్థి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటి యువతకు కనెక్ట్ అయ్యే అన్ని అంశాలుంటాయి. చక్కటి సందేశం కూడా ఉంటుంది’ అన్నారు. ‘ప్రతి ప్రాంతంలో జరిగే ఓ అంశాన్ని తీసుకొని దర్శకుడు ఈ చిత్రాన్ని తీశాడు. సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది’ అని హీరో చేతన్ చీను తెలిపారు.