Actor Arya | తమిళ్‌తో పాటు తెలుగులోనూ హీరోగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్య తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. త్వరలో విడుదల కానున్న తన కొత్త చిత్రం ‘మిస్టర్ ఎక్స్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా ప్రారంభమయ్యాయి. తన కెరీర్ ప్రారంభంలో చేసిన నేనే దేవుడ్ని సినిమా షూటింగ్ సందర్భంగా ఎదురైన అనుభవాలను ఆర్య గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కోసం వారణాసి (కాశీ)లో కొంతకాలం షూటింగ్ జరిపామని, అక్కడ నిజమైన సాధువులతో పాటు నకిలీ వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపారు.
ఆర్య మాట్లాడుతూ.. కాశీలో ఉన్న సాధువుల్లో చాలా మంది నిజాయితీ గలవాళ్లే. కానీ కొంతమంది మాత్రం సాధువుల వేషంలో క్రిమినల్స్‌గా ఉంటారు. వాళ్లకు ఎలాంటి గుర్తింపు పత్రాలు ఉండవు. పేరు అడిగినా ‘స్వామి’ అని మాత్రమే చెబుతారు. కొంతకాలం అక్కడ దాక్కొని తర్వాత వెళ్లిపోతారు” అని చెప్పారు అంతేకాకుండా కుంభమేళా సందర్భంగా కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశముందని ఆర్య వెల్లడించారు. “మేము కుంభమేళా షూటింగ్‌కు వెళ్లినప్పుడు పోలీసులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది సాధువుల వేషంలో ఆయుధాలు కూడా కలిగి ఉంటారని చెప్పారు అని ఆయన పేర్కొన్నారు.
ఆర్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఆయన మాటలకు మద్దతు తెలుపుతూ, వాస్తవ పరిస్థితులను వెల్లడించారని అంటుండగా… మరికొందరు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు.ఏదేమైనా, ఒక ప్రముఖ నటుడు ఇలాంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఇది నిజంగా పరిస్థితులని ఉద్దేశించి చెప్పడమా ? లేక అతిశయోక్తి వ్యాఖ్యలా? అనే దానిపై ప్రస్తుతం నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ కొనసాగుతోంది.