టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా చిత్రం గని (Ghani). కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ యాక్షన్ట్రైలర్ (Ghani Action Trailer) ను మేకర్స్ విడుదల చేశారు. బాలీవుడ్ (Bollywood) బ్యూటీ సయీ మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్గా నటిస్తోంది. ఏప్రిల్ 8న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది గని.
‘జీవితంలో కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. వాటన్నింటికి సమాధానం ఒక్కటే..అని వరుణ్ తేజ్ చెబుతున్న సంభాషణలతో షురూ అయింది యాక్షన్ ట్రైలర్. ఆ రోజు నువ్వు టచ్ చేసింది నన్ను కాదు..నా ఈగోను’ అని నవీన్ చంద్ర చెప్పే డైలాగ్స్..హీరో, విలన్ మధ్య పోరు చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతుందని చెబుతున్నాయి.
బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి (Sunil Shetty), జగపతిబాబు, నవీన్‌చంద్ర, నరేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు బాబీ, సిద్దు ముద్దు గని చిత్రాన్నినిర్మిస్తున్నారు.