Ladki Trailer | ‘లడ్కీ’ లవ్, యాక్షన్ ట్రైలర్ అదిరిపోయింది..వీడియో
టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మార్షల్ ఆర్ట్స్ చిత్రం లడ్కీ, ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ (Ladki Enter The Girl Dragon). ఈ మూవీ ట్రైలర్ (Ladki Trailer)ను ఆర్జీవీ, చైనీస్ టీంతో కలిసి విడుదల చేశాడు.

టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మార్షల్ ఆర్ట్స్ చిత్రం లడ్కీ, ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ (Ladki Enter The Girl Dragon). పూజా భలేకర్ (Pooja Bhalekar) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ (Ladki Trailer)ను ఆర్జీవీ, చైనీస్ టీంతో కలిసి విడుదల చేశాడు. నీరు ప్రవహించవచ్చు..లేదా పోటెత్తవచ్చు..నీటిలా ఉండు నా ఫ్రెండ్ అంటూ లేడీ బ్రూస్ లీ (Bruce Lee) పూజాభలేకర్ కు ట్రైనర్ చెప్తున్న సంభాషణలతో మొదలైంది ట్రైలర్.
మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ముందుకు సాగే యువతిగా పూజా భలేకర్ ఓ వైపు యాక్షన్ పార్టుతో అదరగొడుతూనే..మరోవైపు అందాలను ఆరబోస్తుంది పూజా. హిందీతోపాటు చైనీస్ భాషలో విడుదల కానుంది లడ్కీ. చాలా రోజుల తర్వాత పాత రాంగోపాల్ వర్మ మళ్లీ ప్రేక్షకులకు కనిపించబోతున్నాడని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఇండో-చైనీస్ కో ప్రొడక్షన్ బ్యానర్లో ఆర్ట్సీ మీడియా, చైనీస్ ప్రొడక్షన్ మేజర్ బిగ్ పీపుల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
చైనాలో విడుదల కాబోతున్న తొలి భారతీయ చిత్రంగా లడ్కీ నిలువనుంది. హాలీవుడ్ స్టార్ బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఆర్జీవీ. ఈ మూవీ ఇండియాలోనే మొట్టమొదటి మార్షల్ ఆర్ట్స్ సినిమా కావడం విశేషం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

