Acharya Business | టాలీవుడ్లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ ‘ఆచార్య’. చిరు, చరణ్‌లు ఒకే సారి వెండి తెరపై కనిపించనుండటంతో ప్రేక్షకులతో పాటు సినీప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది.ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. ఈ ప్రమోషన్లలో భాగంగా ఎన్నో విషయాలను చిత్ర మేకర్స్ వెల్లడించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మొదటి నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఈ క్రమంలో ఆచార్య సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఇక ఏరియా వైజ్ బిజినెస్‌ను ఒక సారి గమనిస్తే
నైజాం : 42 కోట్లు
సీడెడ్ : 20 కోట్లు
ఉత్తరాంధ్ర : 13 కోట్లు
ఈస్ట్ : 9 కోట్లు
వెస్ట్ : 7.5 కోట్లు
గుంటూరు : 9 కోట్లు
కృష్ణా : 8 కోట్లు
నెల్లూరు : 4.5 కోట్లు
ఏపీ+తెలంగాణ : 113 కోట్లు
ఓవర్సీస్ : 12 కోట్లు
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 12 కోట్లు
వరల్డ్ వైడ్ : 137 కోట్లు
‘ఆచార్య’ చిత్రానికి 137కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే 140కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘కేజీఎఫ్’ చిత్రం కన్నడలోనే కాకుండా ప్రతి భాషలో భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. ముఖ్యంగా తెలుగులో కలెక్షన్లు కన్నడ కలెక్షన్లకు పోటీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆచార్య ఇంత మొత్తంలో బిజినెస్ జరుపుకుంది. ‘కేజీఎఫ్’ పోటీని తట్టుకుని ‘అచార్య’ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తుందా? లేదా? అనేది చూడాలి.