టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) లేటెస్ట్ మూవీ ఆచార్య (Acharya). కొరటాల శివ (Koratala Siva) డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో రాంచరణ్ (Ram Charan) కీ రోల్ పోషిస్తున్నాడు. మెగా అభిమానులు, ఫాలోవర్లు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్.
‘ఇక్కడ అందరూ సౌమ్యులు..పూజలు, పురస్కరాలు చేసుకుంటూ..కష్టాలొచ్చినపుడు అమ్మోరు తల్లి మీద భారమేసి..బిక్కుబిక్కుమని ఉంటామేమోనని పొరబడి ఉండొచ్చు..ఆపదొస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది ’ అంటూ రాంచరణ్ డైలాగ్స్ తో షురూ అయింది ట్రైలర్. ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలతో ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతది అంటూ చరణ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
‘ పాదఘట్టం వాళ్ల గుండెల మీద కాలేస్తే ఆ కాలు తీసేయాలట..కాకపోతే అది ఏ కాలా..?..నేనొచ్చానని చెప్పాలనుకున్నా..కానీ చేయడం మొదలుపెడితే’ అని విలన్ తో చిరు చెప్తున్న తనదైన స్టైల్ డైలాగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా కనిపిస్తున్నాయి. కామ్రేడ్స్ గెటప్స్ లో చిరంజీవి, రాంచరణ్ మధ్య వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు హైలెట్గా నిలువబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఏప్రిల్ 29న గ్రాండ్గా విడుదల కాబోతుంది ఆచార్య.