మెగాస్టార్ చిరంజీవి, అందాల ముద్దుగుమ్మ కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కాగా, కరోనా వలన పలుమార్లు వాయిదా పడింది. అన్ని సినిమాలకి సంబంధించి మళ్లీ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తుండగా, ఆచార్య సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై క్లారిటీ రావడం లేదు.
తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేడ్ ఒకటి ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తైన నేపథ్యంలో సినిమాని దీపావళికి విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీపావళికి రజనీకాంత్ సినిమా విడుదల కానుండగా, ఈ సినిమా కూడా అదే సమయంలో విడుదల అవుతుందా అనే దానిపై సందిగ్ధం నెలకొంది.
ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్దా పాత్రలో నటిస్తుండగా పూజా హెగ్డే .. చెర్రీ సరసన నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.