Animal Movie | బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’ (Animal). అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కేవలం అయిదు రోజుల్లోనే రూ.482 కోట్ల మార్కును దాటేసింది. ఇక ఈ చిత్రంలో రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో బాబీ డియోల్.. చేసింది చిన్న రోల్ అయినా.. సినిమా మొత్తం ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో అబ్రార్ (బాబీ డియోల్) ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే సాంగ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. జమల్ జమాలో అంటూ ఒక పాట సాగగా.. ఈ సాంగ్‌ను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించి మేకర్స్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ పాటను మీరు చూసేయండి.